కందకుర్తి పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం?

– ఐదు తరగతులకు  ఇద్దరే ఉపాధ్యాయులు,

– పదవ తరగతి విద్యార్థులకు 50% సిలబస్ మాత్రమే పూర్తి
– అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు
నవతెలంగాణ – రెంజల్
కందకుర్తి పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరే ఎస్ జి టి ఉపాధ్యాయులు ఉండడం శోచనీయమని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత విద్యాశాఖ అధికారులకు తమ సమస్యలను విన్నవించిన ఎలాంటి ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలల లో పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు రాయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 50% సిలబస్ పూర్తి కాలేదని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు డిప్యూటేషన్ పై సాటాపూర్ ఫారం నుంచి ఒకరు, రెంజల్ పాఠశాల నుండి మరొకరిని నియమించినప్పటికీ, వారు నెలలో 6 నుండి 8 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారని, మిగతా రోజులలో రెండు, మూడు తరగతులను కలిపి బోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు 9 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా, కేవలం ముగ్గురుని డిప్యూటేషన్ పై పంపడం ఎంతవరకు సమంజసం ఆన్నారు . హై స్కూల్ విద్యార్థులకు సీనియర్ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఎస్జిటి టీచర్లతో కొనసాగించడం జరుగుతోంది. గత ఏడు సంవత్సరాల కిందట ఈ పాఠశాలను పదవ తరగతికు అప్గ్రేడ్ చేశారు. అప్పటినుండి రెండు మూడు సంవత్సరాలు 100% ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఉపాధ్యాయుల కొరతతో విద్యా బోధన జరగడంలేదని వారన్నారు. ప్రస్తుతం ఆరు నుంచి పదవ తరగతి వరకు 155 మంది విద్యార్థిని విద్యార్థులు, ఐదవ తరగతి వరకు 1038 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండగా, హై స్కూల్ కు ఇద్దరు ,sgt ఉపాధ్యాయులు, ఐదవ తరగతి వరకు ఒకే ఒక ఉపాధ్యాయురాలు విద్యా బోధన అందిస్తున్నారు. పేపర్ ముదిరి నుంచి మరో ఉపాధ్యాయురాలు ఇంగ్లీష్ తెలుగు సబ్జెక్టులను బోధిస్తూ ఉన్నారు. పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని ఎస్ఎంసి కమిటీ చైర్మన్ లు తస్లీమ్ బేగం, నిస్సార్ బేగ్ లు కోరుతున్నారు.
తస్లీమ్ బేగం, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్: తమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతూ స్థానిక ప్రజా ప్రతినిధులతో పలుమార్లు కమిషనరేట్ కు వెళ్లి తమ సమస్యలను విన్నవించినా ఇంతవరకు ఉపాధ్యాయులను నియమించడం లో విఫలమయ్యారని తస్లిమ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆమె విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
నిస్సార్ బేగ్ం, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్: ఐదు తరగతులకు ఒకే ఒక ఉపాధ్యాయురాలని కేటాయించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పేపర్ మిల్లు నుంచి మరో ఉపాధ్యాయురాలని ఏర్పాటు చేసినప్పటికీ ఇంగ్లీష్, తెలుగు, సబ్జెక్టులను బోధిస్తూ ఉండగా మిగతా తరగతులను ఒకే ఒక ఉపాధ్యాయురాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. ఉపాధ్యాయురాలు తరగతి గది వరండాలో విద్యార్థులను కూర్చోబెట్టి రెండు తరగతులను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.