– నోట్లో బెల్లంపెట్టి కంట్లో కారం
– కొట్టిన కేంద్ర బడ్జెట్
– ఉద్యోగస్తులు ఆర్‌యస్‌యస్‌లో
– పని చేయవచ్చు అని కేంద్రం ప్రకటన
– దేశ లౌకిక స్పూర్తికి గొడ్డలిపెట్టు
– ఆర్‌యస్‌యస్, బీజేపీ కొట్లాట నాటకం, ప్రజల్లో గందరగోళం సృష్టించే ఎత్తుగడ
– ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సమావేశాలలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్
నవతెలంగాణ-మియాపూర్
రానున్న కాలం దేశ భవిష్యత్తుకు సవాల్‌గా మారను న్నదనిఎంసీపీఐ(యూ)జాతీయ ప్రధాన కార్యదర్శి కా మ్రే డ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. ఎంసీపీఐ (యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావే శం మియాపూర్, ముజఫర్ అహ్మద్‌నగర్ తాండ్ర రామ చంద్రయ్య స్మారక భవన్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తుడుం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. స మావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సమానమైన పద్దతు ల్లో ఆయా రాష్ట్రాల ఆదాయం ప్రాతిపదికన నిధులు కేటా యించలేదని, బీజేపీ పాలిత, బీజేపీకి మద్దతు ఇస్తున్న రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించి, బీజేపీ పాలన లేని రాష్ట్రాలకు అరకొర నిధులు కేటాయించటం కేంద్ర బీజేపీ పాలనలో పక్షపాత, రాష్ట్రాల హక్కులను, రాజ్యాంగ స్ఫూ ర్తిని పూర్తిగా దెబ్బకొట్టడమే అన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమాన నిష్పత్తిలో కేటాయింపులు జరుగలేదని 70శాతం ఉన్న వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 40 శా తం నిధులు కేటాయించాలసి ఉండగా 1.52 లక్షల కోట్ల ను కేటాయించటం, విద్యారంగానికి బడ్జెట్‌లో 30 శాతం బడ్జెట్ కేటాయించాలసి ఉండగా కేవలం 1.48 లక్షల కో ట్లు కేటాయించటం సబబు కాదని ఈ బడ్జెట్ నోట్లో బె ల్లం పెట్టి కంట్లో కారం కొట్టిన చందంగా ఉందని ఇది పెట్టుబడిదారీ, కార్పోరేట్ వర్గాల ప్రయోజనం కోసం ఈ బడ్జెట్ కేటాయింపులున్నాయన్నారు. బీజే పీ కేంద్రంలో సోమవారం విడుదల చేసిన జీవో ప్రభు త్వ ఉద్యోగస్తులు ఆర్‌యస్‌యస్‌లో పని చేయవచ్చని జీవో విడుదల చేయడం అప్రజాస్వామిక చర్య అని రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి భిన్నమైన చర్య అని ఇది అనేక త్యాగాలు చేసి నిర్మించు కొన్న లౌకికవాదం, ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని తక్షణమే జీవోను రద్దు చేయాలని అన్నారు. ఒక వైపు మోడీకి వ్యతిరేకంగా ఆర్‌యస్‌యస్ పేరుతో మీడీయాలో జోరుగా కార్పోరేట్ మనువాద మీడియా చే స్తున్న ప్రచారం అంతా ఉత్తినే అని కేంద్ర ప్రభుత్వం విడు దల చేసిన జీవో తేటతెల్లం అయిపోయిందన్నారు. ఇటీ వల పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గినప్పటికీ తె లుగుదేశం, జనతా దళ్ (యు) అండతో కేంద్రంలో అధికా రంలో కొనసాగుతున్న తీరు దానికి బాబు, నితీష్ మద్దతు ఇస్తున్న తీరుపై ప్రజలు ప్రజాతంత్ర శక్తులు సంపూర్ణం గా వ్యతిరేకించాలన్నారు. సమావేశంలో ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని బడ్జెట్‌లో బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జా తీయ హౌదా కల్పించలేక పోవటం, జాతీయ రహదా రులపై నిర్లక్ష్యం వహించటం, ఇంకా రాష్ట్ర విభజన హా మీలను విస్మరించిందన్నారు. పార్లమెంటుకు తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది పార్లమెంటు సభ్యులు ఏమి చేస్తు న్నారని, ఎందుకు పార్లమెంటులో ఉండటం వెం టనే రాజినామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్సు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, కుం భం సుకన్య, వరికుప్పల వెంకన్న, ఎన్ రెడ్డి హంసా రె డ్డి,పెద్దారపు రమేష్, యస్ కే నజీర్, వాంకుడోతు తుకా రాం నాయక్, గోనె కుమారస్వామి, మంద రవి రాష్ట్ర కమిటీ సభ్యులు మాలోతు జబ్బర్ నాయక్, మైదం శెట్టి రమేష్, నర్రా ప్రతాప్, కంచ వెంకన్న, గుండె బోయిన చంద్రయ్య, కుసుంబ బాపురావు, పల్లె మురళి, కర్ర రా జిరెడ్డి, వంగాల రాగసుధ, తాండ్ర కళావతి, అంగడి పు ష్ప, పి. బాగ్యమ్మ, కనుకం సంద్య, గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి తదితరు పాల్గొన్నారు.