– ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ పై అవగాహన
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశ భవిష్యత్ నేటి విద్యార్ధులు చేతుల్లోనే ఉంటుందని,మంచి పౌరులుగా రూపొందిస్తే నే భవిష్యత్ భారతాన్ని నిర్మించడానికి వీలు ఉంటుందని అదనపు ఎస్సై వీ.రామ్మూర్తి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో బుధవారం ప్రిన్సిపాల్ అల్లు అనిత అధ్యక్షతన ,”మాదక ద్రవ్యాల నివారణ” అనే అంశం పై విద్యార్ధులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన ఎస్ఐ రామమూర్తి మాట్లాడుతూ దేశ భవిషత్ విద్యార్థుల చేతుల లోనే ఉందని,విద్యార్థులు మాదక ద్రవ్యాలకు,మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని అన్నారు.మత్తు పదార్ధాలు వినియోగిస్తే జీవనం దుర్భరంగా మారుతుంది అన్నారు.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని, మత్తు పదార్థాలు వినియోగించి నా,విక్రయించి నా కఠిన చర్చలు ఉంటాయని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ అనిత మాట్లాడుతూ విధ్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కళాశాల ఏజీఎంఓ అరవింద్ మాట్లాడుతూ ఒకప్పుడు మాదక ద్రవ్యాల వినియోగం పాశ్చాత్య దేశాలలో ఉండేదని ఇప్పుడు మన దేశంలో గ్రామీణ స్థాయికి విస్తరించిందని,విధ్యార్థులు అందరూ మత్తు పదార్థాల నివారణకు సహకరించాలని కోరాలి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.