మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జుక్కల్ శాసన సభ్యులుచాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. జవహర్‌లాల్ నెహ్రూ జయంతి భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరి జీవితం, వారసత్వం మరియు ఆదర్శాలను జరుపుకునే రోజు భారతదేశంలో పిల్లల అభివృద్ధి, విద్య మరియు శాస్త్రీయ పురోగతిలో ఆయన గొప్ప పాత్ర పోషించారని కొనియాడారు. నేటి బాలబాలికలే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులని తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని ప్రతి విద్యార్థిని క్రమబద్ధంలో పెట్టి ఉన్నత స్థాయిలకు చేర్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14న, భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని ఎంతో ఉత్సాహంగాఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు. చిన్న పిల్లలందరు చాచా నెహ్రూ అని పిలుస్తారని అతని పుట్టినరోజును దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారన్నారు.దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సేవలను స్మరించుకోవడమే కాకుండా దేశంలోని యువతరం పట్ల ఆయనకున్న గాఢమైన ఆప్యాయతను గుర్తుచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కమల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.