– తండ్రి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ నసురుల్లాబాద్
మద్యం మత్తులో భార్యను పిల్లలను చిత్రహింసలు పెట్టడంతో ఓ బాలిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ లకు పిర్యాదు చేసింది, బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన లతీఫ్, గౌసియా బేగం లకు పుట్టిన కూతురు సిరిన్ ఫాతిమా(9) అనే బాలిక శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. తన తండ్రి లతీఫ్ నిత్యం మద్యం సేవించి తన తల్లి గౌసియను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అడ్డువచ్చిన తనను కూడా విపరీతంగా కొడుతున్నాడని కన్నీరు పెట్టింది. తన తల్లిని తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఎట్లైనా సరే తన తండ్రి పై చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంది. బాలిక ఫిర్యాదు మేరకు తండ్రిలా టిఫిన్ పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.