
– ప్రేమ వివాహంలో రెండున్నర నెలల క్రితం అమ్మాయి మృతి..
– మూడు నెలలు అనంతరం అబ్బాయి మృతి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన బిట్కూరి మనోహర్ కురుమ (23), అదే గ్రామానికి చెందిన ఎస్సీ అమ్మాయి సుమారు రెండున్నర నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో కాపురం చేసే సందర్భంలో మార్చి 8వ తేదీన మృతి చెందింది. మృతి చెందిన వెంటనే మనోహర్ రాత్రి పురుగుల మందు సేవించి, చికిత్స చేయడంతో బతికి బయటపడ్డాడు. కాగా అమ్మాయి మృతికి అబ్బాయి తల్లిదండ్రుల వేధింపులే కారణమని కేసు నమోదు కావడంతో అబ్బాయి తో పాటు ఇద్దరు తల్లిదండ్రులు నల్గొండ జైలుకు వెళ్లి మూడు నెలలు శిక్ష అనుభవించారు. కాగా ఇటీవలనే పది రోజుల క్రితం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కాగా తల్లిదండ్రులు భువనగిరి మండలం చీమల కొండూరులో నివాసం ఉంటుండగా, వారి కుమారుడు మనోహర్ బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామంలో బంధువుల ఇంటి వద్ద ఉంటున్నాడు. కాగా సోమవారం మండల కేంద్రంలో ఎం ఎస్ ఎన్ కంపెనీ వెనకాల మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని చనిపోయాడు. బుధవారం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చీమల కొండూరులో జరగనున్నాయి. కాగా మృతికి గల కారణాలు తెలియ రాలేదు. జైలు జీవితం అనుభవించి మనస్థాపానికి గురై చనిపోయాడా, లేదా ఎవరైనా చంపేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.