మహిళల భద్రత , సాధికారతే లక్ష్యం

– బీబీజీ గ్రూపు ఛైర్మన్‌ మల్లికార్జున్‌ రెడ్డి
హైదరాబాద్‌ : మహిళల భద్రత, సాధికారతే లక్ష్యంగా శంషాబాద్‌లో భరోసా కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు బిల్డింగ్‌ బ్లాక్‌ గ్రూప్‌ (బిబిజి) ఛైర్మన్‌ మల్లికార్జున్‌ రెడ్డి తెలిపారు.. బాలికలు, మహిళల కోసం సురక్షితమైన కమ్యూనిటీలను రూపొందించడంతో బిబిజి నిబద్ధతకు నిదర్శనమని మల్లికార్జున్‌ రెడ్డి అన్నారు.
మహిళలు, పిల్లలకు అవసరమైన నమ్మకాన్ని, మద్దతును పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. హింస, లైంగిక వేధింపుల బారిన పడిన మహిళలు, పిల్లలకు తిరిగి చక్కటి పరిష్కారాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్డింగ్‌ బ్లాక్స్‌ గ్రూప్‌ 449వ టాలెంట్‌ ఫ్యాక్టరీ కార్యక్రమానికి తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ మహిళా, శిశు భద్రతా విభాగానికి చెందిన డిసిపి సృజన కర్ణం హాజరయ్యారు