– రాష్ట్ర వెద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ జోగిపేట
సేవ చేయడమే తన లక్ష్యమని, తొమ్మిదన్నర ఏళ్ల తర్వాత నన్ను గెలిపించి మరోసారి అవకాశం ఇచ్చారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం జోగిపేటలో పలు ప్రైవేటు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగిపేట ప్రజల అభివృద్ధి కోసం తన వంతు కృషి ఉంటుందన్నారు. ప్రజలను జీవితంలో ఎప్పుడు మర్చిపోనని స్పష్టం చేశారు.
జోగిపేట గుమాస్తా సంఘం ఆధ్వర్యంలో సన్మానం
జోగిపేట గుమస్తా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఘనంగా సన్మానించారు. సంఘం సభ్యుల కోరిక మేరకు గుమస్తా సంఘానికి వెళ్లారు. సంఘం ఆవరణలో నూతనంగా నిర్మించబోయే పనులకు సహకారం అందించాలని అధ్యక్షులు డాకురి శంకరయ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఎస్‌ఎస్‌కే సమాజ్ (పట్కరి) ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. ఫ్లోరింగ్, కిచెన్ షెడ్, సీలింగ్, సీసీ రోడ్డు పనులను చేయించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లాగా ఆయన హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, ఆకుల.చిట్టిబాబు, సుమిత్ర సత్యం, రంగ సురేష్, డి.శంకర్, పి.రేఖ ప్రవీణ్, హరికృష్ణాగౌడ్, కే. నాగరాజ్, చందర్, దుర్గేష్, మాజీ ఎంపీటీసీ డి. వెంకటేశం, గుమస్తా సంఘం అధ్యక్షుడు డాకూరి శంకరయ్య, ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, ఉపాధ్యక్షులు ఆకుల నవాజ్, దుర్గయ్య, కొశాధికారి నర్సింలు, ఎఎస్‌కే గౌరవ అధ్యక్షులు జగన్నాథం, చందర్, అధ్యక్షుడు నాగరాజ్, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, కొశాధికారి నందు, కాంగ్రెస్ నాయకులు డాకూరి శ్రీనివాస్, శరత్ బాబు, సతీష్, శివ, కష్ణ, రవి, శ్రీను , రాములు తదితరులు పాల్గొన్నారు.