విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యం

– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ ను గెలిపించండి
– పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతు
నవతెలంగాణ – సిరిసిల్ల
ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఉపాధ్యాయ నియోజక వర్గం నుండి 0 ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్న అశోక్ కుమార్  గెలుపు కోసం మద్దతు ఇస్తున్న సంఘాల తో శుక్రవారం రాజన్న జిల్లా కేంద్రంలో సమావేశం టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, కన్వీనర్ దుమాల రమనాద్ రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు కో కన్వీనర్ పరకాల రవీందర్  అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్  మాట్లాడుతూ.. అశోక్ కుమార్ 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ టిపిటిఎఫ్ లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమం కొరకు నిరంతరం ఉద్యమాలు నిర్మించి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకులుగా పేరు ప్రఖ్యాతలు గడించారని, నిజాయితీకి నిబద్ధతకు నిస్వార్ధతకు మారు పేరుగా నిలిచిన అశోక్ కుమార్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా సరైన అభ్యర్థి అన్నారు. ఈ నెల 27 న జరిగే ఎన్నికల్లో అశోక్ కుమార్ నుమొదటి ప్రాధాన్యతా ఓట్లతో గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్తిస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి విక్కుర్థి అంజయ్య, టీఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు పలు ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.