– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
– ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి గెలుపు కాంక్షిస్తూ నల్లగొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ
నవతెలంగాణ -నల్లగొండకలెక్టరేట్
ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పోరాటాలు చేస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలిచే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సోమవారం నల్లగొండ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి గెలుపు కాంక్షిస్తూ నల్లగొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్, రామగిరి, శివాజీనగర్, రవీంద్రనగర్, హైదరాబాద్ రోడ్డు, క్లాక్‌టవర్, ఆర్‌పీ రోడ్డు, పాతబస్తీ, దేవరకొండ రోడ్డు, ప్రకాశంబజార్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు అండగా నిచిలేది, పేదల సమస్యల పరిష్కారానికి కషి చేసేది ఎర్ర జెండా మాత్రమేనని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, గిరిజన, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నదని సీపీఐ(ఎం) మాత్రమే అన్నారు. కాబట్టి, శాసనసభలో ప్రజా సమస్యలపై గళమెత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సీపీఐ(ఎం) అభ్యర్ధులకు అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం కొట్లాడటానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనసభల్లో కమ్యూనిస్టులు లేని లోటు కనిపిస్తుందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యులు స్వార ్ధప్రయోజనా లకు, కాంట్రాక్టుల కోసం కొట్లాడుతున్నారన్నారు. వారిని ఓడిరచి సీపీఐ(ఎం) నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు సయ్యద్ హాషం, పాలడుగు గార్జున, ఎం.ప్రభావతి, ఎమ్‌డి.సలీం, నన్నూరి వెంకటరమణా రెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి పాల్గొన్నారు.