మాదక ద్రవ్యాల నిర్ములనే ప్రభుత్వ లక్ష్యం

The goal of the government is to eradicate drugs– నిజామాబాద్ రేంజ్ నార్కోటిక్ డీఎస్పీ సోమనాథన్
– విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మాదక ద్రవ్యాల సమూల నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యాంటి నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిందని నిజామాబాద్ రేంజ్ నార్కోటిక్ డీఎస్పీ ఎం.సోమనాథన్ అన్నారు. యాంటి నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో పట్టణంలోని నలంద కళాశాలలో శుక్రవారం మత్తు పధార్థాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత షీటీం, సైబర్ క్రైమ్ సేవల గురించి ఆయా విభాగాల సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మత్తు పదార్ధాల నియంత్రణపై ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన నాటి నుంచి విద్యార్థులు, యువత తమకు తెలియకుండానే అపరిచిత లింక్లను ఓపెన్ చేస్తు సైబర్ నేరాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ సిబ్బంది రియాజ్ విద్యార్థులకు వివరించారు.
చెడు వ్యసనాలకు ప్రభావితం కావద్దు
ఈ సందర్భంగా నార్కోటిక్ డీఎస్సీ సోమనాథన్ మాట్లాడుతూ.. చెడు వ్యసనాలు అతి త్వరగా ప్రభావితం చేస్తాయని, అయితే వాటి బారిన పడటం, పడకపోవడమనేది మన స్వీయ నియంత్రణపై ఆధారపడి ఉంటుందని.. డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీరం నియంత్రణను కోల్పోయి దాని కోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగట్టేలా ప్రేరేపిస్తుందన్నారు. మాధక ద్రవ్యాల నియంత్రణకు జాతీయ స్థాయిలో నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్తాల చట్టం 1985 యాక్ట్ ఉన్నప్పటికి… సీఎం రాష్త్ర స్థాయిలో యాంటి నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణా వ్యవస్థను మరింత పటిష్టం చేశారన్నారు. జిల్లాలోని లక్ష్మీపూర్ చెకోపోస్టు వద్ద ఇటీవల 900 క్వింటాళ్ల గంజాయి పట్టుబడటం సంచలనంగా మారిందన్నారు. గంజాయి స్మగ్లర్లకు జీవతఖైదు పడవచ్చని, ఈ అక్రమ దందా ద్వారా వారు సంపాదించిన ఆస్తులను రికవరి చేసుకునే హక్కు చట్టానికి ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, డీ.సి.ఆర్.బి డీఎస్పీ సురేందర్ రెడ్డి, సీఐ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ పున్నారావ్, వైస్ ప్రిన్సిపల్ విజయ్ గోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.