కాటారంలో కలకలం సృష్టిస్తున్న బంగారం వేట?

Gold hunt creating a stir in Kataram?– నివాస గృహంలో పూజలు, జంతుబలి .?
– బంగారం చూపిస్తానంటూ పలువురు దగ్గర లక్షలు వసూలు.?
– వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళ సూత్రధారి.?
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలు రోజురోజుకు గ్రామాలలో ఎక్కువవుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకు మాయమాటలు చెప్పి పలువురిని ఆకర్షించుకుంటున్నారు.పాత గృహాలలో, పాడుబడ్డ స్థలాలలో బంగారం ఉంటుందని వెలికి తీసి ఇస్తామంటూ ప్రచారం చేస్తూ పలువురిని లోపు లోపరు చుకుంటున్నారు. అదే విషయమై కాటారం మండల కేంద్రంలో కొన్ని రోజుల క్రితం పెద్ద ఎత్తున బంగారం కోసం జంతుబలి ఇవ్వడంతో పాటు పలు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆలస్యంగా సమాచారం బయటకు వస్తోంది. వరంగల్ ప్రాంతానికి చెందిన ఒ మహిళ ఈ కార్యక్రమానికి సూత్రధారిగా తానే పాత్రధారిగా వ్యవహరించి బంగారాన్ని వెలికి తీసేందుకు వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. పలూరి గృహాలలో లేదా పాత స్థలాలలో బంగారం వెలికి తీస్తానంటూ తోచినట్టుగా కొంతమంది నుంచి పెద్ద మొత్తంలో మహిళ డబ్బులు వసూలు చేసినట్లుగా ఆ మహిళకు తోడుగా కాటారం చెందిన ఒక వ్యక్తి కీలక భూమిక పోషించినట్లు సమాచారం. కాటారంలోని కొన్ని రోజుల క్రితం ఆర్థరాత్రి నివాస గృహంలో ఇంటి చుట్టూ ఉన్న పాత మట్టి గోడలను తీసివేసి ఆ ఇంటిలో అర్ధరాత్రి బంగారం ఉన్నదంటూ పూజలు చేసినట్లు తెలిసింది. బంగారాన్ని వెలికి తీసేందుకు మేకను జంతు బలి ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. జంతుబలితో బంగారం ఉన్నచోట సంతృప్తి పూజ జరగలేదని మనిషిని ఆహారంగా ఇవ్వాలంటూ పూజలు చేసిన వ్యక్తి కోరుతూ ఒక మనిషిని కొంతసేపు భూమిలో ఉంచినట్లు సమాచారం. కొన్ని గంటల పాటు నిర్వహించిన పూజ అనంతరం బంగారం వెలికి తీసారా లేదా అనేది పూర్తి వివరాలు బయట పడలేదు. జంతు బలి ఇచ్చిన మేకల మాంసం వాసన రాకుండా ఉండేందుకు తరువాత బయటపడేసినట్లు చర్చించుకుంటున్నారు. నివాస గృహంలో పూజలు చేసిన యజమాని ప్రస్తుతం ఆ ఇంటిలో ఉండకుండా వేరే ప్రాంతంలో అద్దెకు ఉంటున్నట్లుగా సమాచారం అక్కడ ఆ విషయం బయట పడకుండా ఉండేందుకు ఇంటికీ చాటు చేసినట్లు తెలిసింది. గ్రామంలో కొందరి వ్యక్తుల నుంచి బంగారం చూపిస్తానంటూ తోచినట్టుగా డబ్బులు వసూలు చేసినట్లు చర్చించుకుంటున్నారు. గతవారం మండలంలోని చింతకాని గ్రామంలో క్షుద్ర పూజలు చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే గ్రామాలలో గంజాయి సేవించడం విక్రయించడం తద్వారా పక్షులు కార్పన్యాలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నాయి. గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతుండడంతో కొంతమేరకు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కాటారం మండల కేంద్రంలో బంగారం వేట కోసం పలువురు ప్రయత్నాలు చేయడం కలకలం సృష్టిస్తోంది.