– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలు పగడ్బందీగా అమలు చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోరం కనకయ్య, అన్నారు. మున్సిపల్ చైర్మన్ డివి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు, 22వ వార్డు కౌన్సిలర్ అంకెపాక నవీన్ కుమార్, పట్టణ అధ్యక్షులు డానియల్ నాయకులు మడుగు సాంబమూర్తి, శీను, సూర్యం, జాఫర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.