నవతెలంగాణ – తొగుట
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకె ల గారడీ గా ఉందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆరోపించారు. శుక్ర వారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడు తూ ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్ దశ, దిశ లేకుండా ఉందని, ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపే బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో భూలోక స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంలో మోసం చేశారన్నారు. ఏడాదిలో 2 లక్షలు ఉద్యో గాల ప్రస్తావనే లేదని, ఆరు గ్యారంటీలను పూర్తిగా మరిచిపోయారని మండి పడ్డారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అప్పులు చేసిందని నిందించారని, భట్టి రూ. 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారని చెప్పారని గుర్తు చేశారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన దానికంటే రూ. 17 వేల కోట్లు ఎక్కువ అని చెప్పా రు. మహాలక్ష్మి పథకంపై బడ్జెట్ మహా నిరాశ కలిగించిందన్నారు. కోటి మంది మహిళలు నెలకు రూ.2500 కోసం ఎదురుచూస్తున్నారని, ఎనిమిది నెలల్లో మహిళలకు రూ.20వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడ్డదని పేర్కొన్నారు. ఆసరా పింఛను రూ.4 వేలు, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం మరిచిపోయారని గుర్తు చేశారు.
గత బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయం రూ. 18,470 కోట్లు ఉంటే, నేడు రూ. 25,617 కోట్లకు పెంచారని తెలి పారు. రూ. 7,147 కోట్లు ఎక్కువ పెంచుతామంటే తాగుబోతుల తెలంగాణ చేస్తారా ? బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పి, గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా అని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరు ద్యోగ భృతి, ఉద్యోగులకు డీఏ ప్రస్తావన కూడా లేదని అన్నారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని, చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రతిష్టత్మాకంగా ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్టు, బీసీ, దళిత బంధు పథకాలకు నీళ్లు వొదిలార న్నారు. దళిత బంధు పథకం స్థానంలో అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళిత కుటుంబానికి రూ. 12 లక్షలు ఇస్తామని మోసం చేశారన్నారు. కుల వృత్తులకు డోఖా చేశారని, గొర్ల పథకం ఎత్తి వేశా రని, బతుకమ్మ చీరేల ప్రస్తావన లేదన్నారు. రుణ మాఫీకి రూ. 15వేల కోట్లే కేటాయించారని, పంద్రాగస్టు కల్లా ఏకకాలంలో రైతు రుణ మాఫీ ఎలా చేస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు, భూమి లేని వారికి ఇంటి స్థలం ఇస్తా మని, ఇందిరమ్మ పథకం కు సరిపడా నిధులు ఇవ్వ లేదన్నారు. కేంద్రం లోని బీజేపీ సర్కార్ కూడా తెలంగాణ కు డోఖా చేసిందని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు సున్నా కేటాయించారని విమర్శిం చారు. 8 మంది ఎంపీ లు, 8మంది ఎమ్మెల్యే లు ఉన్న బీజేపీ ప్రతినిధులు స్పందించాలన్నారు. తెలంగాణ కు కెసిఆర్ శ్రీ రామ రక్ష అని పేర్కొ న్నారు. సమావేశం లో మండల యూత్ అధ్య క్షులు మాదాసు అరుణ్ కుమార్, నాయకులు సుతారి రమేష్, రాములు, రాంబాబు, ఎంగలి రాజు తదితరులు ఉన్నారు.