బీసీల అణచివేతకు ప్రభుత్వం కుట్ర..

– రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి దోనె అశోక్
– కులగణనలో బీసీలకు ప్రభుత్వం అన్యాయమంటూ అగ్రహం
నవతెలంగాణ – బెజ్జంకి
అగ్రవర్ణాలను అందలం ఎక్కించి..బీసీల అణచివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోనె అశోక్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ వ్యవహరించిన తీరుపై గురువారం మండల కేంద్రంలో అశోక్ అగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అశోక్ మాట్లాడారు.కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం  వెనుకబడిన జాతుల యువకులకు నిరుద్యోగులు, యావత్ వెనుకబడిన జాతులను మోసం చేసేల కుట్రచేస్తుందని..ఆశాస్త్రీయంగా చేపట్టిన కులగణనను సమాజం అంగీకరించదన్నారు. మైనార్టీలను బీసీలో  సమ్మెళనం చేసి ప్రభుత్వం వివరాలు వెళ్లడించడం అన్యాయమేనని..బీసీ కులగణనను ప్రభుత్వం తిరిగి చేపట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.బీసీ కుల సంఘాల నాయకులు ఒగ్గు సురేష్,దొడ్ల ప్రశాంత్,అడుకని వెంకటేష్,రంజిత్ గౌడ్,మాషం కొంరయ్య,దొంతరవేణి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.