
– హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని, ఆరుగాలం శ్రమించిన కర్షకులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మండిపడ్డారు. శనివారం హుస్నాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతులకు మద్దతుగా రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు. అన్నదాతల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయం చేయడం తప్ప, రైతులకు అండగా నిలబడటంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు .పంట నష్టపోయిన రైతులను పొలాల్లోకి అధికారులు గానీ, మంత్రులు గానీ చూసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటకు క్వింటాలుకు రూ .500/రూపాయలు బొనస్ ఇవ్వాలన్నారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరానికి రూ. 25,000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని , చనిపోయిన ప్రతీ రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్సగ్రెషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ఎంపీపీలు లకవత్ మానస సుభాష్, మాలోత్ లక్ష్మి బీలు నాయక్, జెడ్పిటిసి భూక్య మంగా , పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, మండల అధ్యక్షుడు గంగం మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.