– పార్టీ శ్రేణులకు పిలుపు…
– బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి బడే నాగ జ్యోతి…
నవతెలంగాణ – తాడ్వాయి
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని ములుగు మాజీ జడ్పీ చైర్ పర్సన్, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగ జ్యోతి అన్నారు. బుధవారం మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తూరు గ్రామంలో ఊరట్టం ఎంపీటీసీ పరిధిలో మండలంలోని పార్టీ గ్రామ శాఖలు, సీనియర్ నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంపీటీసీ పరిధి సమన్వయ కమిటీని,ఊరట్టం,మేడారం,కల్వపల్లి గ్రామ పంచాయతీ సమన్వయ కమిటీలను ఎన్నుకున్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యకర్తలు అందరూ సమన్వయంతో ముందుకు పోవాలని, ,రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, జాజ చంద్రం, గోపన బోయిన కొమురయ్య, జీడి బాబు, మాజీ సర్పంచులు చిడం బాబురావు, గొంది శ్రీధర్, గ్రామ కమిటీ అధ్యక్షులు గజ్జల మహేష్, గజ్జల సమ్మయ్య, పీరీల నరేష్, భుశబోయిన శంకరయ్య, పుర్రి సరూప, ఇర్ప విజయ, సతీష్, పోషాలు, చెల్మయ్య, అశోక్ రెడ్డి, బద్రమ్మ, గొరిగా శ్రీను, గొరిగ రవి, నల్లముక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు.