
నవతెలంగాణ – పెద్దవంగర
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్ విమర్శించారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ 420 హామీలతో కూడిన వినతి పత్రాలను గురువారం సమర్పించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 420 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, అంతే కాకుండా ప్రశ్నించిన ప్రతి పక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ, రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగించడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఇలా రాష్ట్రాన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారన్నారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు శ్రీరాం సుధీర్, రాసాల సమ్మయ్య, మాజీ సర్పంచులు సాయిలు, భాస్కర్, రఘు, పటేల్ నాయక్, నాయకులు వెంకటరామయ్య, కుమార్ స్వామి, గంగాధర్, శ్రీనివాస్, బిక్షపతి, వీరన్న, ఊషయ్య, అనుదిప్, చంద్రబోస్, కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.