
బీసీల ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం చేసింది శూన్యమని,ఇది బీసీల బంధు పథకం కాదని, బీసీల రాబందు పథకమని, ఇది బీసీ రాజకీయ పథకం తెలంగాణ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాదల్ లక్ష్మీనారాయణ అన్నారు.శనివారం యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆర్థిక ప్రగతి కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటైన విషయమన్నారు.ప్రస్తుతం పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల కన్నా చాలా వివక్షతో కూడిన పరిపాలన కోనసాగుతుందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన బిసి కార్పొరేషన్ 1975 నుండి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం నిలుపుదల చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేషన్ లోనుండి వచ్చే ఆర్థిక సాహయంను ఈ ప్రభుత్వం 2018 నుంచి అమలు చేయడం నిలిపివేసింది విమర్శించారు. 2018 -19 లో 36 లక్షల దరఖాస్తుదారులు ఆర్థిక సాయం కోసం వినతులు సమర్పిస్తే ఇప్పటివరకు వాటి పైన స్పందన లేకుండా ఉందన్నారు. పలుమార్లు బీసీ అధికారులు, మీడియా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిరంతరం నిమ్మకు నీరెట్టునట్టు వ్యవహరించినట్లు తెలిపారు. ఇప్పుడు బీసీల అభివృద్ధికి కట్టుబడ్డ ఉన్నామని నటిస్తుందని, ప్రభుత్వం, ఏ ప్రతిపక్ష పార్టీలు ఈ విషయం పైన స్పందించకపోవడం హాస్యస్పద మన్నారు. బీసీ లలో చేతివృత్తి కులాలు సుమారు 50 పైగా ఉంటే చేతివృత్తుల కులాలు ఉంటే, అందులో 15 కులాలను ఎంపిక చేసి ఇది బీసీ బందు అని ఎలా అంటారని అయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి బీసీల ఆర్థిక ప్రగతి, సామాజిక అభివృద్ధి ఏమాత్రం ఆసక్తి ఉన్న, బీసీ లోని 140 ఉన్న ఉప కులాలకు బీసీ బందు ప్రకటించాలన్నారు. బీసి బందు పథకాన్ని ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం లక్ష రూపాయలు ఏమాత్రం సరిపోదని, దీన్ని పది లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి నరేష్, కార్యదర్శి సూర్య, గణేష్, శివకుమార్ పాల్గొన్నారు.