
నవతెలంగాణ – తుర్కపల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల కు పెంచాలనీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కార్యదర్శి బట్టిపల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఐద్వా మండల నాయకత్వంతో కలిసి జిల్లా కార్యదర్శి భట్టుపల్లి అనురాధ హాస్పిటల్ నీ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. తుర్కపల్లి మండల కేంద్రంలో అనేక తండాలతో కూడుకున్న ప్రాంతం ఈ ప్రాంతం ప్రజలంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రుల కు వస్తుంటారు కాబట్టి వారికి మెరుగైన వైద్యం కల్పించాలని అన్నారు.మండల కేంద్రంలోని ఆసుపత్రిలో కేవలం 6 పడకల ఆసుపత్రిగా ఉన్నది దీనిని 50 పడకల ఆస్పత్రిగా పెంచాలని అదేవిధంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం ల కొరిత ఉన్నది ఆ కోరుతాను భర్తీ చేయాలని అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఆవుల కళమ్మ లక్ష్మి, పోచమ్మ ,అనురాధ, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.