దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

The government is committed to the welfare of the disabled– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – సిరిసిల్ల
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఓ సమావేశానికి రాగా, విప్ ను పలువురు దివ్యాంగులు కలిశారు. జిల్లా పరిధిలో వివిధ శాఖలలో ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో  దివ్యాంగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. జిల్లాలో ఉన్న 25 ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే వివిధ ఉద్యోగాలలో దివ్యాంగులకు లభించే 3% రిజర్వేషన్ను అమలు చేసేలా చూడాలని కోరారు. తద్వారా వారికి ఉపాధి కల్పించిన వారమవుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.