ప్రభుత్వం సమగ్ర కుల గణన చేయడం పట్ల హర్షం

నవతెలంగాణ – ఆర్మూర్
శాసనసభ లో బీసీ సమగ్ర కుల గణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు దొండి రమణ సోమవారం హర్షం వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని అసెంబ్లీ ఎన్నికలలో బీసీలు మొత్తం కాంగ్రెస్ కు ఓటు వేసి అధికారం తెచ్చినట్లే. లోక్ సభ ఎన్నికల్లో కూడా 17 స్థానాలు గెలిచే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఇది చారిత్రాత్మక నిర్ణయం అని బీసీలు పట్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తన ప్రేమను చాటుకుందని అన్నారు.