విద్యారంగం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది..

– సోలం కృష్ణయ్య ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వ విద్యా రగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తుందని ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి సోలం కృష్ణయ్య అన్నారు. గురువారం మండలం లోని  పస్రాలో  ఎస్ టియు  మండల శాఖ సమావేశం అధ్యక్షుడు జన్ను శ్యామ్సన్  అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సోలం కృష్ణయ్య హాజరై మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది అని   అన్ని ప్రభుత్వ శాఖలలో పదోన్నతులు జరుగుతున్నప్పటికీ కేవలం  విద్యాశాఖలో మాత్రం ఎనిమిది సంవత్సరాలు గా ఉపాధ్యాయులకు ఎటువంటి పదోన్నతులు లేకుండా  ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ  ప్రభుత్వ విద్య వ్యవస్థ ను ఇబ్బందికి గురి చేస్తున్నారని కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ కోర్ట్ పరిధిలో ఉన్న కేస్ లను ఎత్తివేత కు తగు చర్యలు తీసుకొని పదోన్నతులు బదిలీలు చేపట్టాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఆర్ధిక సంవత్సరంలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను ఉపాధ్యాయ, ఉద్యోగులకు మంజూరు చేయాలని కోరారు. గత పీఆర్సీలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని నివారిస్తూ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే పిఆర్సి కమిటీ ని వెంటనే ఏర్పాటు చేసి   ఇంటీరియం రిలీఫ్ (ఐ ఆర్)ప్రకటించి అమలు చేయాలని, అలాగే రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగుల కు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్  అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని 317  జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కే జి బి వి మరియు సమగ్ర శిక్ష పరిధిలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి ,దిలీప్ ,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు