– రైతు భరోసా పథకం ప్రారంభం..
– మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని ఆదివారం నాయకులతో కలిసి అధికారులు రాళ్లపేటలో ప్రారంభించారు. రైతు భరోసా పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ… రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీనీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ,రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకా ఆయా గ్రామాల్లో పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోని వారు ఉంటే సంబంధిత కార్యాలయాల్లో అర్జీలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ శేషాద్రి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గం గౌడ్, తాసిల్దార్ జయంత్ కుమార్ పాల్గొన్నారు.