మణిపూర్ ప్రభుత్వం ను భర్తరఫ్ చేసి శాంతి భద్రతలను కాపాడాలి..

– సీసీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్  డిమాండ్
నవతెలంగాణ- తాడ్వాయి
సీసీఐ ఆధ్వర్యంలో  కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన  మణిపూర్ రాష్ట్రంన్ని కాపాడాలి అని నిరసనలు చేశారు ఈసందర్భంగా సీసీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ మణిపూర్ ని హగ్ని గుండాలం రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం  మార్చింది అని అక్కడ మహిళకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3నెలలు పైగా రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్న చోద్యం చూస్తూ ఉండటం దుర్మార్గపు పాలనలా వ్యవరించడం బాధాకరం అని రాష్ట్ర ప్రభుత్వంని వెంటనే బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలనను విధించి శాంతి భద్రతల కాపాడాలని అన్నారు మణిపూర్ రాష్ట్రంలోని అటవీ వనరులు, ఖనిజ సంపదలను అదాని, అంబానీలకు కట్టబెట్టేందుకే ఘర్షణలను బీజేపీ రెచ్చగొడుతోంది అని అన్నారు. ఇప్పటికే 500 మందికి పైగా చనిపోయారు. క్షతగాత్రులు వేలల్లో ఉన్నారు అని వెంటనే దేశ ప్రధాని మోదీ స్పందించి మణిపూర్ లో శాంతి వాతావరణం నెలకొల్పలని అన్నారు. ఇలాంటి ఘర్షణలు చేస్తూ దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంని తప్పకుండా వచ్చే ఎన్నికలో ప్రజలు బుద్ధి చెపుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తో పాటు జిల్లా కోర్ కమిటీ  నాయకుడు మోతిరాం నాయక్  నాయకులు అరుణ్, ప్రకాష్, శ్రీనివాస్, మదు, రాజు, నరేష్   తదితరులు పాల్గొన్నారు.