బాలుడి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి 

The government should be held responsible for the boy's death– బతుకుదెరువు కోసం వెళ్లిన కుటుంబనికి పితృశోకమై మిగిలింది 
– బయట కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
నవతెలంగాణ – మిరుదొడ్డి
బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లిన కుటుంబానికి పుత్రశోకం మిగిలిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సీనియర్ నాయకుడు సుకురి లింగం, తుమ్మల బాలరాజు లు  అన్నారు. గురువారం మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్- లక్ష్మి దంపతుల కుమారుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని బిఆర్ఎస్ నాయకులతో కలిసి వారు పరామర్శించారు. పట్టణాల్లో, గ్రామాల్లో వీధి కుక్కలు, కోతులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి కుక్కలు, కోతుల బెడద నుండి పరిష్కారం చూపాలని అన్నారు. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన విహాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించడంతోపాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సల్లూరి మల్లేశం ,సత్యనారాయణ, బాపురెడ్డి, రాధాకృష్ణ, బాబు పలువురు పాల్గొన్నారు.