పేదలకు ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలి

The government should build houses for the poor– సోమ మల్లారెడ్డి సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి 
నవతెలంగాణ – గోవిందరావుపేట  
సీపీఐ(ఎం) జాతీయ రహదారిపై ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా మండలంలోని నిరుపేదలందరికీ ప్రభుత్వం మే ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పొదిల్ల చిట్టిబాబు లు ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో  మండల కేంద్రంలో 163 వ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు  ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇల్లు ఇంటి స్థలాలు కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మల్లారెడ్డి, చిట్టిబాబు లు మాట్లాడుతూ మండలంలోని పసర సుందరయ్య నగర్ 109 సర్వే నెంబర్లు లో 500 మంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 109ఈ/అ సర్వే నెంబర్  పుల్యాల వసంత పేరుతో ఇచ్చిన అక్రమ పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఉన్న కలెక్టర్ ఐటీడీఏ పీవో ప్రభుత్వ భూమి అని నిర్ధారించారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా పారిశ్రామిక అభ్యర్థులకు వేలాది ఎగరాల భూమిని అప్పనంగా కట్టబెడుతూ ఉందని, వారు పరిశ్రమలు కట్టింది లేదు. ఉద్యోగాలు ఇచ్చింది లేదని అన్నారు. ఈ ప్రకారంగా వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంచడం ప్రభుత్వానికి చెల్లిందని అన్నారు. ప్రభుత్వము గృహ నిర్మాణ సంస్థ ద్వారా పేదలకు నిలువ నీడ లేనివారికి గూడు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరిస్తుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలుపరచడం లేదని ప్రశ్నించారు. అదేవిధంగా మండల కేంద్రంలో దయ్యాలవాగు పరిసర ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద ఇల్లు కట్టించి ప్రత్యేక కాలనీ నిర్మించి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ప్రాజెక్టు నగర్ తరచూ వరద ముంపుకు గురవుతుందని వరదల వల్ల గ్రామస్తులు మృతి చెందడం కూడా జరిగిందని అన్నారు. అక్కడి ప్రజలకి ప్రభుత్వం సురక్షితమైన ప్రాంతంలో ప్రత్యేక కాలనీ నిర్మించి ఇవ్వాలని కోరారు. చివరగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ సతీష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ,అంబాల మురళి, గొంది రాజేష్ ,గుండు రామస్వామి, కడారి నాగరాజు, గుండు లెనిన్, కాప కోటేశ్వరరావు, కందుల రాజేశ్వరి, మంచాల కవిత, గోపిశెట్టి ఐలయ్య,  కృష్ణారావు ,అరుణ్, జీవన్, వల్లపు రాజు, మంచోజు బ్రహ్మచారి, సంకినేని రాజేశ్వరి, సువర్ణ ,శారద ,సరిత, సమ్మక్క, రాజు, రాంబాబు ,సరిత  సులోచన, ఆంజనేయులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.