
అకాల వర్షంతో నష్టపోయిన రైతులని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భువనగిరి వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ మన్నె శ్రీధర్ అన్నారు. మండలంలోని మార్యాల గ్రామంలో పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రేయి పగలు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయి మొలకెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరిని వదిలి ధాన్యం కొనుగోలని వేగవంతం చేయాలన్నారు. క్వింటాలుకు 500 బోనస్ ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రైతు బంధు డబ్బులు కొందరికి జమ కాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వెంటనే ప్రభుత్వం మేలుకొని రైతులకు బోనస్ 500 తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు సందగల్ల పెద్దులు, ప్యారారం రాములు, కోండ్ర సాయికుమార్, ప్యారారం అనిల్ ,రైతులు పాల్గొన్నారు.