– దళితుల, యాదవుల మధ్య రెవెన్యూ అధికారులు గొడవ పెంచొద్దు
– యాదవుల భవన నిర్మాణానికి మరొక్క చోట స్థలం చూపించాలి
– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య
నవతెలంగాణ-మంచాల
దళితుల భూమిని ప్రభుత్వం లాక్కోవద్దని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య అన్నారు. మంగళ వారం మండల పరిధిలోని జపాల్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ జపాల్ గ్రామంలో 96 సర్వే నెంబర్ భూమిలో గత 50 ఏండ్ల నుంచి దళితులు కబ్జాలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు లాక్కోవాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా దళితులు కబ్జా ఉన్న భూమిపై దళితులకు, యాదవులకు మధ్య రెవెన్యూ అధి కారులు గొడవ పెట్టి, ఏకంగా భూమినే లాక్కోవాలని చూడ టం సరైంది కాదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇండ్ల స్థలాలు ఇస్తామని గొప్పలు చెప్పే ప్రభుత్వం దళితుల భూమిని లాక్కోవాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డుల ఏర్పాటు కోసం ప్రభు త్వం దళితుల భూములనే లాక్కుందన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జపాల్ గ్రామంలో దళితులు కబ్జాలో ఉన్న భూమిని లాక్కోవద్దని కోరారు.అంతేకాకుండా యాద వ భవ న నిర్మాణానికి మరోచోట స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జపాల్ గ్రామ కమిటీ కన్వీనర్ యాట పాండు, మండల కమిటీ సభ్యులు లెనిన్, హాఫిజ్ పాషా తదితరులు ఉన్నారు.