
నవ తెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లాలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు లో గల జిల్లా గోసంగి సంఘం భవనంలో ఎస్సి 57 ఊపకులల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సి ఉప కులాల ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పస్తం పరుశురాం మాట్లాడుతూ ఎస్సి అంటే మాల, మాదిగ కులలే కాకుండా 57 వెనకబడ్డ కులాలు ఉన్నాయని వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్రంలో 25 లక్షల జనాభా కలిగిన ఉపకులాలపై ప్రభుత్వానికి చిన్న చూపు తగదని అన్నారు. వచ్చే దళిత బంధు లో ఉప కులాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన గోసంగి, బెడ బుడగ జంగం, మొచి, హోలియదాసరి, మేతరి (వాల్మీకి) కులాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ఉప కులాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్బంగా కోరారు.
దళితరత్న అవార్డు గ్రహీతలు సన్మానం:
దళితరత్న అవార్డు గ్రహీతలు సన్మానం:
ఎస్సి ఉప కులాలకు చెందిన నాయకులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితరత్న అవార్డు గ్రహీతలైన గంధం రాజేష్, మోచి శంకర్ లకు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపకులల ప్రతినిధులు అంకమొల్ల సాయిలు, గంధం బుద్దిరాజు, ఈర్నల వెంకట రమణ, మోచి శంకర్(జేఏసీ), సంకు పోచయ్య, లింబాద్రి, పోశెట్టి, ఆనంద్, వీరేశం, మాదినం సీతారాములు తదితరులు పాల్గొన్నారు.