
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి 75వ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటున్న తరుణంలో వయోవృద్ధుల సంక్షేమానికై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీనియర్ సిటిజన్ అధ్యక్షులు మల్యాల పోశెట్టి అన్నారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శ్రీ అనంత ఆంజనేయ స్వామి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశం శుక్రవారం నిర్వహించినారు.. ఈ సందర్భంగా సర్వ సమాజ్ యందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వెల్మల నడిపి మల్లయ్య ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి, కార్యదర్శి లక్కారం పోశెట్టి, కార్యవర్గ సభ్యులు ఆకుల నడిపి రాజన్న, టీవీ సాయన్న అంకాపూర్ బాజన్న తదితరులు పాల్గొన్నారు.