ప్రభుత్వం నిరుపేదలకు జీవన ప్రతి కల్పించాలి

– అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత ప్రచారం..
నవతెలంగాణ – రెంజల్ 
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సంవత్సరానికి 12 వేల రూపాయల జీవన భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సోమవారం బోర్గం గ్రామంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఐడి కార్డులతో పాటు, 4000 రూపాయల పింఛన్, ఏడాదికి 12,000 వేల రూపాయల జీవన అభివృద్ధిని వెంటనే ప్రకటించాలని వారు కోరారు. ఈ విషయంపై గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పార్వతీ రాజేశ్వర్, పుట్టి నడిపి నాగన్న, మండల అధ్యక్షులు వడ్డెన్న, ప్రధాన కార్యదర్శి ఎస్ కె నసీర్, కోశాధికారి సిద్ధ పోశెట్టి, సాకలి సాయిలు, కురుమే మల్లేష్, రవి, నాగుల లక్ష్మణ్, గుండ్ల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.