నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని,బాన్సువాడ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇందూరు గంగాధర్ సంఘీభావం తెలిపారు. యూనివర్సిటిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ 11రోజు రిలే దీక్షలలో బాగంగా అయన పాల్గొని సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. తరగతి గదిలో బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ బయటకు వచ్చి నిరసన తెలియజేయడం సబాబుకాదన్నారు. ఇది మానవ వేదనతో బాధతో కూడుకున్న విషయమని,వారు చెప్పుకోలేక అటు విద్యార్థులకు చెప్పలేక, తోటి రెగ్యులర్ ఉపాధ్యాయులకు చెప్పుకోలేక తమ సమస్య కోసం తమను తానుగా డి గ్రేడ్ చేసుకుంటూ తన నైపుణ్యాన్ని విద్యార్థులను బోధిస్తూ నిజమైన ఉపాధ్యాయుడిగా తన మనుగుడను సాగిస్తున్నారని పేర్కొన్నారు. వారే భవిష్యత్ తరానికి పునాదులని, ఈ భవిష్యత్ తరానికి వారసులుగా తయారు చేసే ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతే ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదన్నారు. పీజీ విద్యా బోధించే విద్యార్థులు దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతిచ్చరని వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్న పోరాటం న్యాయమైందని, ముఖ్యమంత్రి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.రిలే దీక్షలకు మద్దతు ఉంటుందని,ఎన్ని రోజులు దీక్షలు చేస్తే అన్ని రోజులు మీతోనే ఉంటామని విద్యార్థి లోకం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు, పలువురు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.