– గాంధీజీ చిత్రపటానికి వినతిపత్రం అందజేసిన ఆశాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు
నవతెలంగాణ-తలకొండపల్లి
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని ఆశా వర్కర్లు సుజాత, మాధవి అన్నారు. సోమవారం తలకొండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమందిని భాగస్వామ్యం చేసి పోరాటం చేశారని గుర్తు చేశారు. గాంధీ చేసిన పోరాట త్యాగ ఫలితం మూలంగానే జాతిపితగా పేరుపొందారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సమ్మ, కవిత, యాదబాయి, కోమిటి పుష్ప, వెంకటమ్మ, కవిత , జయ, అనురాధ, విమల, సరస్వతి, అలివేల, చంద్రకళ, నిర్మల, శ్రీదేవి, మహేశ్వరి, రానిబాయి, శిరీష, పద్మ, రాములమ్మ, శివలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వినతిపత్రం అందజేశారు. వారు చేపట్టిన సమ్మె మంగళవారంతో 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ దేశానికి శాంతి, అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు గాంధీజీ అని కొనియాడారు. ప్రభుత్వం తక్షణమే అంగన్‌వాడీ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పెన్షన్ ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు హెల్పర్స్‌కు రూ.5 లక్షలు చెల్లించాలని రిటైర్మెంట్ వయస్సు 60 ఏండ్లు నిర్ణయించాలని, ఇలా 25 ప్రధానమైన డిమాండ్లతో సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యాదమ్మ, చంద్రకళ, గిరిజ , సువర్ణదీవి, మల్లమ్మ, పద్మ, భూషణమ్మ, అనసూయ, అనంతమ్మ, రాజ్యలక్ష్మి, శైలజ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
5వ రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె
సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె 5వరోజుకు చేరింది. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి, గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం గుర్తించి కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రమాదేవి, నాగమణి, కమలమ్మ, అంజమ్మ, ప్రమీల, దేవకమ్మ, మన్నెమ్మ, యాదమ్మ, పద్మ, అరుణ, రావులమ్మ ,సువాలీ, శ్యామ్ ,బాలమణి తదితరులు పాల్గొన్నారు.