కోడిగుడ్లు నిత్యవసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలి

నవతెలంగాణ – మోర్తాడ్
గత ఐదు నెలల నుండి మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకులకు బిల్లులు రాక ఇబ్బందులకు గురవుతున్నారని , నిర్వహణ ఇబ్బందిగా కలుగుతుందని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కింగ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపు నూరు చక్రపాణి అన్నారు. మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో ఆయన సమావేశం అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహనకు సంబంధించి ప్రభుత్వమే కోడిగుడ్లు నిత్యవసర సరుకులు అన్నిటిని పంపిణీ చేయాలని ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయడం ద్వారా నిర్వాహకులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. నిర్వాహకులు సరైన సమయంలో సామాగ్రిని పంపిణీ చేయకపోవడంతో నిత్యవసర సరుకులను ఏజెన్సీ నిర్వాహకులు కొనుగోలు చేయాల్సి వస్తుందని దీని ద్వారా వారు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మధ్యన భోజన నిర్వాహకులకు తక్షణమే బిల్లులు మంజూరు చేయాలంటూ మండల విద్యాశాఖ సిబ్బందికి వినతి పత్రాలు అందించారు.