మృతి చెందిన నాయి బ్రాహ్మణ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

– నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్
నవతెలంగాణ – నెల్లికుదురు
నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం మాజీ మండల అధ్యక్షులు నిమ్మకంటి సోమయ్య మృతి చెందాడని ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం, మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరికుoట్ల మౌనేందర్ అన్నాడు. మృతి చెందిన నిమ్మకంటి సోమయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నాయి బ్రాహ్మణ కుటుంబంలో పేదరికంతో ఉంటూ కొన్ని ఏళ్ల నుండి ఎంతోమందికి సేవ చేశారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతిచెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరినట్లు తెలిపారు. ఈ కుటుంబాన్ని ఆదుకున్నందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినాడు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎలకంటి గణేష్ దడగల చంద్రయ్య కుమ్మరి కుంట్ల ఉప్పలయ్య నాగవెల్లి రవి పరమేష్  వెలకంటి వెంకన్న వెలకంటి శ్రీను కుమ్మరి కుంట్ల సోమయ్య కుమ్మరి కుంట్ల రవి మస్కాపురి రమేష్ ఎడ్ల రమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.