పాడి గేదెలు కోల్పోయిన రైతు కుటుoబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..

Government should support the farmer family who lost their milk buffaloes..– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి.. మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కరెంట్ తీగలు తగిలి మూడు పాడి గేదెలు మృతి చందగా, పాడి గేదెల  మృతితో దిక్కు తోచని రైతు కట్ల శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరు బాలరాజు గౌడ్ కోరారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని సాయి కన్వెన్షన్ వెనుక భాగంలో గల మడికట్లలో శుక్రవారం  భువనగిరి పట్టణానికి చెందిన కట్ల శ్రీను తండ్రి లింగయ్యకు చెందిన మూడు పాడి గేదలు పొలం గట్లపై మేస్తుండగా కరెంటు వైర్లు తెగి పాడి గేదెలపై పడి కరెంటు షాక్ తో మూడు గేదెలు చనిపోయినవి కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశువులకు,  రైతులకు చేతికి అందే విధంగా కరెంటు తీగలు సరి చేయకపోవడంతో లక్షల రూపాయల విలువైన మూడు పార్ట్ గేదలు కరెంట్ షాక్ తో మృతి చెందినవి గేదలు చనిపోయిన కట్ల శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వము నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో అనేక రోజులుగా కరెంటు వైర్లు మనుషులకు తాకే విధంగా ఉన్న పట్టించుకోకపోవడంతో ఈరోజు రైతు గేదెలు కరెంట్ షాక్ తో మరణించిన మని అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని కరెంటు డిపార్ట్మెంట్ నుండి మరియు బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించి కట్ల శ్రీను కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.