
నవతెలంగాణ- కంటేశ్వర్
గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బందికి కనిస వేతనాలు అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా వివక్షత చూపుతుందని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ విమర్శించారు.ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ-బి ఎల్ పి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బందిలో 90% శాతం కార్మికులు ఎస్సీలు పనిచేస్తే 10% ఇతర బహుజన సామాజిక కులాలకు చెందిన వారు పనిచేస్తున్నారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. గత వారం రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున సమ్మె పోరాటానికి బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బాహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా కన్వీనర్ కాంబ్లీ మధు, జీ.గోపి, ఎ.రాజు, కె.రాజులుపాల్గొన్నారు.