– కొల్లాపూర్ నియోజక ప్రజలు చైతన్యవంతులు
– సీఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క.
నవతెలంగాణ- పెద్దకొత్తపల్లి
పేద ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నా టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పాతర పెట్టాలని అలాగే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పాలని కొల్లాపూర్ నియోజక ప్రజలు చైతన్యవంతులని సెల్ఫీ నేత మల్లు బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్క్ పాదయాత్ర రెండవ రోజు పెద్దకొత్తపల్లి మండలం కేంద్రం నుంచి పెదకారపాముల, దేవినేనిపల్లి గ్రామాలకు చేరుకుంది. ఆయన వెంట సీఎల్పీ ఉపాధ్యక్షుడు మల్లురవి. టిపిసిసి సభ్యులు చింతలపల్లి జగదీశ్వరరావు ఉన్నారు. దేదినేని పల్లిలో గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇస్తే లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఓటు వేసి గెలిపిస్తే ,గెలిచిన మూడు నెలలకే కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కెేసీిఆర్ కు అమ్ముడుపోయి ప్రజాస్వామ్యా ద్రోహిగా మిగిలిపోయారని ఆయన దుయ్యబట్టారు. కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలు చైతన్యవంతులని 2024 ఎన్నికలలో తగిన ప్రజాస్వామ్య ద్రోహులకు పార్టీ ఫిరాయిం చిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని, వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒకే ఇంట్లో ఉన్న వద్ధులకు ఇద్దరికీ పింఛన్లు ఇస్తుందని, 9 నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గులాం రసూల్, ఒక మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాలపిరు, ముష్టి పల్లి సర్పంచ్ నాగమ్మ కురుమయ్య ,రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.