
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ అలేర్ శాసనసభ్యులు బిర్ల ఐలయ్య సన్మాన మహోత్సవం విజయవంతం చేయాలని బొమ్మలరామారం మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గురువారం సాయంత్రం భువనగిరిలో న్యూ దీప్తి హోటల్లో జరగబోయే సన్మాన మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన నాయకులు, యూత్ కాంగ్రెస్ యువకులు ప్రతి ఒక్కరూ సన్మాన మహోత్సవం విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సిరెడ్డి, కళ్లెం సాయికుమార్ గౌడ్, గోపికృష్ణ, అలీమ్, జమీల్, మధు,శ్రవణ్, ఉపేందర్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.