కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్..

Government Whip visited Rajanna with his family.నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, జన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకున్న వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆది  కుటుంబ సభ్యులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవాలయ వేదపండితులు, స్వామివారికి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం  శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, రాజరాజేశ్వరీ దేవిని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పారాయణ మండపంలో విప్ దంపతులకు  లో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసినారు,ఆలయ ఈఓ వినోద్ రెడ్డి శాలువా కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ప్రభుత్వ విప్   ఆది శ్రీనివాస్  జన్మ దిన సందర్భంగా రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్,ఏ ఈ ఓ లు బి.శ్రీనివాస్, జి .రమేష్ బాబు లు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపినారు. ఆయన వెంట పర్యవేక్షకులు తిరుపతి రావు, ఎడ్ల శివ సాయి , కాంగ్రెస్ పార్టీ నాయకులు కనికరపు రాకేష్ తోపాటు  తదితరులు ఉన్నారు.