డైరెక్టర్ ను పరామర్శించిన ప్రభుత్వ విప్..

నవతెలంగాణ-భిక్కనూర్
మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురాం రాజమౌళి తండ్రి బాలయ్య సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూరు పట్టణంలో ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురాం రాజమౌళి ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంటా ఎంపీపీ గాల్ రెడ్డి, జెడ్పిటిసి పద్మా నాగభూషణం గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.