
అరుహులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని చలకుర్తి లో ప్రారంబించి మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అందరికి అందేలా చూడాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి వంటి ప్రతి హామీలను నెరవేరుస్తామని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద పదిలక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుస్తునామని,అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ని మహిళకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తుమ్మలపల్లి సర్పంచ్ తుమ్మలపల్లి లలిత వెంకట్ రెడ్డి, తహసీల్దార్ సరోజ, హన్మంత రెడ్డి,వార్డ్ మెంబెర్ తుమ్మలపల్లి సుధాకర్ రెడ్డి,కార్యదర్శి దస్నాయక్, ఏఈఓలు రాము, ఆంజనేయులు, సీతార, అంగనివాడి టీచర్లు,ఆశావర్కర్లు, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.