అధైర్య పడకు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

Don't get impatient.. The government will stand by you– మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కెకె,కాంగ్రెస్ నాయకులు..
– పోతున్న కుటుంబానికి రూ.50 వేల  చెక్ అందజేత
నవ
తెలంగాణ – తంగళ్ళపల్లి
అధైర్య పడకండి.. మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి మృతుని కుటుంబానికి భరోసానిచ్చారు. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ పరిధిలోని సారంపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన జక్కన్ మహేష్ మృతి చెందగా ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు, తాసిల్దార్ జయంత్ కుమార్ లు శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వం అందించే తక్షణ సహాయం కింద రూ. 50 వేల చెక్కును తాసిల్దార్ జయంత్ కుమార్ మృతుని కుటుంబానికి అందజేశారు. అనంతరం ఆయన కుటుంబంతో నాయకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారుల జాబితాలో మా పేరు వచ్చిందనుకొని గ్రామసభకు వెళ్లడంతో అక్కడ ఆ జాబితాలో మా పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదనే మనస్థాపానికి గురికావడంతో ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి తను చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు మృతుని భార్య, కుటుంబ సభ్యులు తెలిపారు. నా పిల్లలను పోషించుకునేందుకు ప్రభుత్వం ఏదైనా దారి చూపాలని కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డిని, తాసిల్దారును మృతుని భార్య నందిని వేడుకుంది. వెంటనే వారు స్పందించి ఇందిరమ్మ ఇల్లు అర్హుల జాబితాలో తన పేరు చేర్చాలని తాసిల్దార్ జయంత్ కు చెప్పారు.నువ్వు ఏదైనా చదువుకుంటే ఔట్సోర్సింగ్ లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని మృతుని భార్యకు హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో మాజీ సర్పంచ్ బైరి శ్రీ వాణి రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బైరినేని రాము, మునిగేల రాజు, చోటు, భరత్ కుమార్, భాగ్య పాల్గొన్నారు.