
నవతెలంగాణ-తొగుట
బాధిత కుటుంబాలను ఆర్థిక చేయూత అందించ డమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీని వాస్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాదు లోని తన నివాసంలో తొగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మదునాల శశాంక్ తండ్రి సంతో ష్ గౌడ్ కు రూ. 2.50 వేల ఎల్వోసి చెక్కును బాధి త కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ పండ్ తో పాటు ఎల్ఓసి నిరుపేద కుటుంబాలకు చెదోడు వాదోడుగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుప్రభాత రావు, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక కో ఆర్డినేటర్ విజయ్ రెడ్డి, విజయ్ పాల్ రెడ్డి, వెంగల్ రావ్, ప్రవీణ్ రజక, రాజా గౌడ్, సండ్రా శ్రీకాంత్, నాయకులు, కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.