పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం ..

Government's goal is the welfare of the poor.– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య
నవతెలంగాణ – కమ్మర్ పల్లి  
పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, మండల ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని నాగపూర్ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పథకాలకు అర్హులైన  లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హామీల ప్రకారం అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఇదే సమయంలో అర్హులైన తమకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని అధికారులను నిలదీశారు. పథకాల పంపిణీలో డబ్బున్న వాళ్ళకు, వ్యవసాయ భూమున్న వాళ్లకు, ఆర్థికంగా బలం ఉన్న వాళ్లకు మాత్రమే స్థానిక నాయకులు ఇచ్చుకున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు.ఏళ్లుగా ఒకే కుటుంబంలో కుమారులు వేరే కాపురం ఉంటున్న వారు రేషన్ కార్డుల కోసం అనేక సార్లుగా ధరఖాస్తు చేసిన కూడా రేషన్ కార్డులు రాలేదని, వ్యవసాయ భూములు, ఆర్థికంగా బాగున్న వారికే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.మంజూరు పత్రాలు ప్రింట్ అవుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు మూడు రోజులు అందిస్తామని ఈ సందర్భంగా తహసిల్దార్ ఆంజనేయులు సమాధానం ఇచ్చి ఆందోళన చేస్తున్న లబ్ధిదారులను శాంతింప చేశారు.కార్యక్రమంలో కమ్మర్  పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఐకెపి ఏపిఎం కుంట గంగారెడ్డి, ఈజిఎస్ ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.