కుక్కల తరలింపు చర్యలు చేపట్టిన జిపి అధికారులు, పాలకవర్గం

నవతెలంగాణ మద్నూర్
మండల కేంద్ర మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మూడు రోజుల క్రితం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఐదుగురి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి పిచ్చికుక్కలు దాటిపై గ్రామస్తులు పంచాయితీ అధికారులపై పంచాయతీ పాలకవర్గంపై అగ్రహం వ్యక్తం చేస్తూ కుక్కల బెడదను నివారించాలని పలుమార్లు విన్నవించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించడమే పిచ్చికుక్కలు సైరవిహారం చేస్తూ ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం ఒక వ్యక్తికి చికిత్సల నిమిత్తం నిజాంబాద్కు తరలించగా మరొక చిన్నారి అమ్మాయికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రానికి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ పంచాయతీకి తరలి వెళ్లి పిచ్చికుక్కల పట్ల నిర్లక్ష్యం వైఖరి ఎందుకని ప్రశ్నించడమే కాకుండా కుక్కల దాడితో ప్రజలకు హాని జరుగుతే బాధ్యత మీరే వహించవలసి ఉంటుందని అటు అధికారులకు ఇటు పాలకవర్గం సభ్యులకు హెచ్చరించడం జరిగింది గ్రామపంచాయతీ పరిధిలోని కుక్కలను నివారించేందుకు మంగళవారం కుక్కలను పట్టుకొని తరలించే చర్యలను జిపి అధికారులు జిపి పాలకవర్గం సభ్యులు చేపట్టారు కుక్కలను పూర్తిగా నివారించాలని తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి కొన్నింటిని పట్టుకొని మరికొన్నింటిని వదిలిపెట్టడం అలా కాకుండా వాడవాడలో ప్రతి ఒక్క కుక్కను పట్టుకొని ప్రయత్నం చేయాలని ఒకటి రెండు రోజులే కాకుండా పూర్తిస్థాయి కుక్కలు దొరికే వరకు ప్రయత్నించాలని గ్రామస్తులు అధికారులు పాలకవర్గం చర్యలపై హర్షం వ్యక్తం చేస్తూ కుక్కలను పూర్తిస్థాయిగా నివారించాలని కోరుతున్నారు