
మండలంలోని గొల్లపల్లి, అన్నారం తదితర గ్రామాల్లో గ్రామపంచాయతీ సర్పంచి తో పాటు పాలకవర్గం దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీడీసీ పాలకవర్గం గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి, శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ… గ్రామపంచాయతీ సర్పంచ్ గా, పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకున్న ప్రజలకు, ఐదు సంవత్సరాలు అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు పాల లావణ్య మల్లేష్, కూడెల్లి అమృత, ఉపసర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి, నరసయ్య, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు సాగర్, జనార్ధన్, వీడీసీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.