
మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపాన ఉన్న పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శివ సత్యనారాయణ స్వామి ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను, వగ్రహాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 23 నుంచి వరుసగా మూడు రోజులు కొనసాగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజులు ఆలయ ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేటితో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. కార్యక్రమంలో వేద పండితులు ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.