– చిరంజీవి, బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
ఐఫా 2024 (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) వేడుక అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దక్షిణాది, ఉత్తరాది తారలు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. ఈ వేడుకలో అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని చిరంజీవి అందుకోవడం ఓ విశేషమైతే, గోల్డెన్ లెగసీ అవార్డును బాలకృష్ణ సొంతం చేసుకోవడం మరో విశేషం. ఇలాంటి విశేషాలకు వేదికగా నిలిచిన ఈ వేడుకలో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సమంతను వరించింది.
ఇదిలా ఉంటే, ఈ వేదికపై టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకష్ణ, వెంకటేష్ సందడి చేశారు. ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. హీరో తేజ సజ్జా, రానా హోస్ట్ చేసిన ఈ వేడుక కన్నుల పండగగా సాగింది.
హీరో నాని ఇండియన్ ఫిల్మ్ ఇండిస్టీలో అరుదైన ఘనతను సాధించారు. ‘దసరా’లో తన అద్భుత మైన నటనకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు (తెలుగు), సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అందుకున్న నాని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులో ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డుని దక్కించుకున్నారు. ‘ఐఫా’లో దసరా సినిమాకి గానూ ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సుధాకర్ చెరుకూరి అందుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ‘దసరా’ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, దసరాకు లభించిన ప్రేమ, గౌరవం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ అవార్డులు మొత్తం నటీనటులు, టీంకషి, అంకితభావానికి నిదర్శనం. అందరికీ కతజ్ఞతలు’ అని తెలిపారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఐఫాలో భగవంత్ కేసరి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.
ఇక మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డుల్ని దక్కించుకుని అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.
ఐఫా 2024 విజేతలు
అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా – చిరంజీవి
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – సమంత
గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకష్ణ
ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్
ఉత్తమ చిత్రం (తెలుగు) – దసరా
ఉత్తమ నటుడు (తెలుగు) – నాని (దసరా)
అవుట్ స్టాండింగ్ ఎక్స్‌లెన్స్ (కన్నడ) – రిషబ్ శెట్టి
ఉత్తమ నటుడు (తమిళం) – విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారారు (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) –
మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) –
ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ (తమిళం) – ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ)
ఉత్తమ విలన్ (తెలుగు) – షైన్ టామ్ (దసర)
ఉత్తమ విలన్ (కన్నడ) – జగపతి బాబు
ఉత్తమ సహాయ నటుడు (తమిళం) –
జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఉత్తమ సాహిత్యం – జైలర్ (హుకుం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ దర్శకుడు (తెలుగు) – అనిల్ రావిపూడి